-బుల్లా విజయ్ కు మద్దతుగా ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ, నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కోరారు. గురువారం 53 వ డివిజన్ బీజేపీ అభ్యర్ధి బుల్లా విజయ్ కుమార్ కు మద్దతుగా నాగుల్ మీరా, టీడీపీ సీనియర్ నేత కోగంటి రామారావు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా కృష్ణ, కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న బుల్లా విజయ్ కుమార్ ను గెలిపించి విజయవాడ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో రూ వందల కోట్లతో పశ్చిమ లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ప్రణాళికలను సిద్ధం చేశారని బుల్లా విజయ్ కుమార్ కు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ సీనియర్ నాయకులు బడుగు వెంకన్న, ముదిగొండ శివ, పల్లె పోగు ప్రసాద్, కత్తి డేవిడ్ , కొమరా కిరణ్, రాజేశ్వరి కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
