60వ వార్డు ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఆకేపాటి సుభాషిణికి ప్రజల మద్దతు అవసరం – డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
60వ వార్డు ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి గారికి వార్డు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని, ఈవీఎంలో వరుస సంఖ్య 1లోని గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఆమెకు మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి, ప్రశాంతమైన వాతావరణం, పిల్లల భవిష్యత్తుకు అవసరమైన మెరుగైన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే నాయకత్వం ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న మహిళా అభ్యర్థి ఆకేపాటి సుభాషిణి గారికి ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని ఆయన కోరారు. వార్డులో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం, ప్రశాంతమైన వాతావరణంలో భావితరాల భవిష్యత్తుకు అనుకూల పరిస్థితులు ఏర్పడేలా కృషి చేయడం ముఖ్యమని పేర్కొన్నారు. 60వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ, ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డా. పసుపులేటి హరిప్రసాద్ గారు అన్నారు.
ఈ సందర్భంగా 60వ వార్డు ప్రజలు అభ్యర్థి ఆకేపాటి సుభాషిణి పట్ల తమ అభిప్రాయాలను, మద్దతును ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయాలని ఆయన కోరారు.