విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గం,78వ డివిజన్,82వ డివిజన్ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు పిరియా జగదాంబ,దాసరి ఉదయశ్రీ కూటమి బలపరిచిన జనసేన పార్టీ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇంటింటికి తిరిగి ఈ రెండున్నర సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వివరిస్తూ, ప్యాంప్లెట్ లు పంచిపెట్టారు.
మాజీ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు చేశారని, ఒకటవ తారీఖున ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తున్నారని, ప్రతి నెల నాణ్యమైన రేషన్ సరుకులు పేదవాడి కందుతున్నాయని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్ ఇటువంటి స్థానిక సమస్యలు లేకుండా ఉండాలంటే కూటమి బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలను లుక్కా కోరారు.
సెంట్రల్ నియోజవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని, గత బుడమేరు వరదలు వచ్చిన సమయంలో కూడా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకుంటూ,సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు. అటువంటి శాసనసభ్యులు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉంటేనే అది సాధ్యం అవుతుందని, గొడ్డలి పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు.కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు.
కూటమి బలపరిచిన అభ్యర్థులు నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తారని, కార్పొరేటర్ల గుర్తు సైకిల్, మేయర్ గ్లాస్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని లుక్కా ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో పిరియా సోమేశ్వరరావు, దాసరి దుర్గారావు(పెప్సి), అమర్నాథ్ గౌడ్, బూత్ ఇన్చార్జిలు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జ్ లు, డివిజన్ నాయకులు, కూటమి నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
