– జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను సవరించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.
సవరించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం….
* పోలింగ్ తేదీ నవంబర్ 5, 2026 (గురువారం), ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు,
* రీపోలింగ్ (అవసరమైన చోట) నవంబర్ 6, 2026 (శుక్రవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.
* అలాగే ఓట్ల లెక్కింపు నవంబర్ 7, 2026 (శనివారం), ఉదయం 8 గంటల నుంచి ఉంటుందని, ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాల ప్రకటన చేయడం జరుగుతుందన్నారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఒకే రోజున ఉండటంతో పోలీసు, పోలింగ్ సిబ్బంది మరియు ఇతర అవసరమైన వనరుల సమర్థ వినియోగం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ను సవరించినట్లు తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఎన్నికల తేదీలపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
