కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ విజయనగర్ కాలనీ కొండ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా బి. వెంకటేశ్వరరావు ఇల్లు జారిపోవడంతో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ గారు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవినాష్ గారు సూచించారు. ఇళ్లకు ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఇల్లు జారిపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించి, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని కోరారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.