మేయర్ బరిలో 14 మంది.. 76 వార్డులకు 333 మంది అభ్యర్థులు

Gnt

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్ ఎన్నికలు–2026లో భాగంగా నవంబర్ 1న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే తుది అభ్యర్థుల జాబితాను నగర కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కె. మయూర్ అశోక్ ఆదివారం ప్రకటించారు. మేయర్ పదవికి 14 మంది, 76 వార్డుల్లో కార్పొరేటర్ స్థానాలకు 333 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.
మేయర్ అభ్యర్థులు వీరే..
మేయర్ పదవికి పోటీ చేస్తున్న 14 మంది అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి గూడవల్లి మణికుమారి, భారత జాతీయ కాంగ్రెస్ నుంచి చొప్పరపు పద్మావతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాడికొండ అలివేలు వెంకట నాగ పద్మశ్రీదేవి, అమరావతి పార్టీ నుంచి డేగల మౌనిక ఉన్నారు.

అలాగే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పఠాన్ మునీర్ సుల్తానా, నవోదయం పార్టీ నుంచి పెండ్యాల మాధవి, నవతరం పార్టీ నుంచి షేక్ ఖాదర్ బీ, రీఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి షేక్ మహ్మద్ జహూరున్నీసా బేగం బరిలో ఉన్నారు.

స్వతంత్ర అభ్యర్థులుగా కండేపల్లి అపర్ణ, గంజి సువర్ణ లత, జరుగుమల్లి జ్యోతి, మన్నే సుధ, సివాలసెట్టి పావని పోటీ చేస్తున్నారు.
కార్పొరేటర్ స్థానాలకు 333 మంది పోటీ
76 వార్డులకు సంబంధించి మొత్తం 333 మంది అభ్యర్థులు తుది జాబితాలో ఉన్నారు. వీరిలో 130 మంది స్వతంత్ర అభ్యర్థులు కాగా, పార్టీల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – 75
తెలుగుదేశం పార్టీ – 57
కాంగ్రెస్ – 26
జనసేన – 20
సీపీఐ – 7
బీజేపీ – 6
బీఎస్పీ – 6
సీపీఎం – 3
అమరావతి పార్టీ – 2
భారత చైతన్య యువజన పార్టీ – 1

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మేయర్, కార్పొరేటర్ స్థానాలకు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్లు కె. మయూర్ అశోక్ వెల్లడించారు. నవంబర్ 1న జరగనున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వివరాలను అధికారికంగా ఖరారు చేసినట్లు తెలిపారు.