-చైత్ర దీపికను అభినందించిన పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్కేటింగ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తూ జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన పెదిరెడ్ల చైత్ర దీపికను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించారు. చైత్ర దీపిక ఈనెల కాకినాడలో జరిగిన 38 వ రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో పాల్గొని ఎన్టీఆర్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి క్వాడ్ స్కేటింగ్ లో రజతం, సోలో డాన్స్ లో కాంస్య పతకం సాధించి 64 వ జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది. చైత్ర దీపిక తను సాధించిన పతకాలతో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి శ్రీధర్ నేషనల్ లెవెల్ స్కేటింగ్ కు అర్హత సాధించిన ఛాంపియన్ చైత్ర దీపికను అదే విధంగా రాష్ట్రస్థాయిలో సోలో డ్యాన్స్, ఫ్రీ స్టైల్ మరియు ఫిగర్ స్కేటింగ్ పోటీల్లో మూడు కాంస్య పతకాలను కైవసం చేసుకున్న కె. దియాశ్రీ ను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయస్థాయి స్కేటింగ్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు.
