విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ ఓ సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి బాధితుడికి అందజేశారు. హెచ్ బీ కాలనీ కు చెందిన అన్సారీ మహ్మద్ (38) ప్రమాదంలో మోచేతికి గాయమావగా శస్త్ర చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరైన రూ 3 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులు బెన్నా బక్తుల సోమేశ్వరరావు, దాడి అప్పారావు, దుర్బేసుల హుస్సేన్, బుదాల నందకుమారి, బొల్లెపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత
