తాడికొండలో ల్యాండ్ పూలింగ్‌కు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతులు

-అమరావతి అభివృద్ధి కోసం 10.76 ఎకరాల భూమి సమర్పణకు అంగీకారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు తాడికొండకు చెందిన పలువురు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం 10.76 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందజేసేందుకు అంగీకారం తెలిపారు.
ఈ మేరకు బుధవారం (నవంబర్ 18, 2026) రైతులు తమ భూములకు సంబంధించిన అంగీకార పత్రాలను ఏపీ సీఆర్డీఏ కాంపిటెంట్ అథారిటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. గణపతిరావుకు అందజేశారు.
తాడికొండ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడంతో అమరావతి రైల్వే లైన్‌తో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
భూములు అందజేసేందుకు అంగీకారం తెలిపిన రైతులు:
నల్లూరి గిరిజ కుమారి
నల్లూరి దీప్తి
వేగుంత అనిల్ కుమార్
నిమ్మగడ్డ శ్రీకాంత్
తాళ్లూరి వెంకట రవికుమార్
తాళ్లూరి ప్రభాకర్ చౌదరి
తాళ్లూరి రామకృష్ణ
తాళ్లూరి వీరభద్రరావు
తాళ్లూరి ఉమామహేశ్వరరావు
దాసరి ఉద్దండయ్య
దాసరి వెంకటేశ్వరరావు
దాసరి శ్రీలక్ష్మి
భాష్యం ధనలక్ష్మి
అక్కినేని యతికృష్ణ (అమెరికా)
మొత్తంగా 14 మంది రైతులు 10.76 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద అందించేందుకు అంగీకార పత్రాలు సమర్పించారు.