మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11:30 గంటల సమయంలో మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో ఉన్న 34వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ సాధారణ ఓటర్లతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యంలో తన బాధ్యతను గుర్తించి తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.