కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి… : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పిలుపునిచ్చారు.
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుంటూ అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని ఆయన సూచించారు. కార్పొరేటర్ అభ్యర్థులు, మేయర్ అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రతి బలిజ కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, వారి విజయానికి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించి, భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గతంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు 63,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన స్ఫూర్తితో, రాబోయే ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డా. పసుపులేటి హరిప్రసాద్ కోరారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఐక్యతతోనే కూటమి విజయాన్ని మరింత బలోపేతం చేయగలమని ఆయన పేర్కొన్నారు.