వెబ్ సైట్ లింక్ లో ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకొనుటకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లింక్ లో పరిశీలించుకోవచ్చుని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ క్రింద తెలిపిన వెబ్ సైట్ లింక్ ఓటరు వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.

🔗 Voter Details Verification Link:
https://sec-ems.ap.gov.in/apsec/voterPortal

ఈ అవకాశాన్ని ఓటర్లు అందరూ వినియోగించుకొని, ముందుగానే తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.