గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ, సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ ఎన్నికల ప్రక్రియను వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిర్వహణపై సమాచారం, స్పందన తెలియజేస్తే అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు.
ఓటరు చీటీలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్నారు. డివిజన్ల విభజన కారణంగా ఓటు ఎక్కడ ఉందో కొంత మందికి తెలియడం లేదని, దానిపై దృష్టి పెడితే బాగుంటుందని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్, కాంగ్రెసు పార్టీ ప్రతినిధి బోట్ల బ్రహ్మయ్య, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఎన్.ఓంకార్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా.టి.సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సి.పి.యం ప్రతినిధి బి. ముత్యాల రావు, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై పిచ్చి రెడ్డి, జన సేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వై వి సుబ్బారావు, తదితరులు హాజరయ్యారు.
