విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల యందు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల కు మినహాయింపు కల్పించాలి అని కోరుతూ ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్ రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం జి మెహది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేఖ సంఖ్య 111/ఆప్టాస్టేట్ /2026 ద్వారా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. రాష్ట్రం లో చాల మంది ఉపాధ్యాయ మరియు ఉద్యోగులు ఆర్థరైటిస్ వంటి నొప్పుల తో బాధ పడే వారు ఉన్నారు. అటువంటి ఉదయం నుండి సాయంత్రం వరకు కదలటానికి వీలు ఉండని ఎన్నికల విధుల యందు నియమించడం ద్వారా వారు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, వారు శరీర భాగాల వాపు మరియు కీళ్ల నొప్పుల తో బాధ పడతారని అటువంటి వారికి మానవతా దృక్పథం తో ఎన్నికల విధుల నుండి మినహాయింపు కల్పించాలి అని వారు డిమాండ్ చేయడము జరిగింది.
