-39 వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థి తిరుపతి అనూష..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తనకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని జనసేన పార్టీ 39 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తిరుపతి అనూష కోరారు. ఎన్నికల ప్రచారం లో చివరి రోజైన శుక్రవారం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జనసేన నాయకులు తిరుపతి సురేష్, మరియు కూటమి నేతలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తిరుపతి అనూష చేపట్టిన ఇంటింటి ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. 39 వ డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు తిరుపతి అనూష విజ్ఞప్తి చేశారు.
