78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల కనకదుర్గ ఇంటింటి ప్రచారం

-కె.ఎల్. రావు రోడ్డులో ఓటర్లను కలిసిన కనకదుర్గ – హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 78వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి వేముల కనకదుర్గ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని కె.ఎల్. రావు రోడ్డులో ఇంటింటికీ తిరుగుతూ స్థానిక ఓటర్లను కలిసి తనకు మద్దతు తెలపాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డివిజన్ ప్రజలు తనకు కార్పొరేటర్‌గా అవకాశం కల్పిస్తే, స్థానికంగా ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ డ్రెయిన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే డివిజన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల అంకమ్మరాజు, కేకేసీ రాష్ట్ర కార్యదర్శి మామిడాల రమణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల దుర్గారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.