-అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు.
-పాత భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, టవర్లు, హోర్డింగ్ ల కింద నిలబడకండి, మీ వాహనాలు నిలపకండి.శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించకండి.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
లోతట్టు ప్రాంతాలు, కొండ పైన నివసిస్తున్న ప్రజలు మరింత అప్రమతంగా ఉండండి, విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలను వినియోగించుకోండి. నదీతీరాలకు వెళ్లకండి. నదులు, కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయకండి.
తల్లిదండ్రులు వర్షపు నీరు నిలిచిన రోడ్లు, కాలువలు, డ్రైన్లు, మ్యాన్‌హోళ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ తీగలు మరియు లోతట్టు ప్రాంతాలకు పిల్లలను వెళ్లనివ్వకండి. కేవలం కాచి చాలార్చిన నీరే తాగండి. ఆరోగ్య సమస్యలకు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి.
వదంతులను నమ్మకండి…
అత్యవసర సమయంలో సహాయం కొరకు మీ సమీప సచివాలయాన్ని. లేదా ఎన్టీఆర్ జిల్లా కంట్రోల్ రూమ్ వారి హెల్ప్ లైన్ నంబర్ 91549 70454 ను సంప్రదించండి.
