లక్షన్నర కోట్ల సంక్షేమం.. 2 లక్షల కోట్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ఘనత: దేవినేని ఉమా

-స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు కూటమివే
-కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కంఠమణి విజయలక్ష్మి, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మారిశెట్టి సౌజన్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. లక్షన్నర కోట్ల సంక్షేమం, రెండు లక్షల కోట్ల అభివృద్ధిని అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 90 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొవ్వూరు పట్టణ అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.