విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తూ బదిలీ ఆర్డర్ తీసుకున్న ప్రిన్సిపాల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కొత్త పాఠశాలల్లో నేడు (18.6.25) విధుల్లో చేరాలని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా విజయవంతంగా, పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల (మోడల్ స్కూల్స్) నుండి సాధారణ బదిలీ ప్రక్రియలో 2608 రెగ్యులర్ ఉపాధ్యాయ సిబ్బందికి గాను 1312 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోగా, దీనిలో 1009 మంది ఉపాధ్యాయులు వెబ్ ఎంపికల ప్రకారం వారు కోరుకున్న పాఠశాలలకు బదిలీ చేసినట్లు తెలిపింది. వీళ్లలో 792 మంది ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీలు, 217 మందికి అభ్యర్థన బదిలీలు జరిపినట్లు పేర్కోంది.
Tags vijayawada
Check Also
యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …
Prajavartha Online Telugu News