Breaking News

తల్లికి వందనం నిధుల విడుదలపై తల్లుల సంతోషం

– సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు
– సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
– సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బోండా ఉమాలకు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లికి వందనం పథకం కింద సెంట్రల్ నియోజకవర్గంలోని మహిళల ఖాతాల్లో నిధులు జమ కావడంతో ఆనందోత్సాహంగా స్పందించిన మహిళలు సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మహిళ కార్యదర్శి అవుటుపల్లి విజయ కుమారి ఆధ్వర్యంలో పలువురు మహిళలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పథకం అమలులో భాగంగా ఇద్దరు పిల్లలుంటే రూ.26,000, ముగ్గురు పిల్లలుంటే రూ.39,000 చొప్పున నిధులు మహిళల ఖాతాల్లో జమయ్యాయి. స్కూల్స్ ప్రారంభమైన రోజునే ఈ నగదు అందడంతో తల్లుల సంతోషానికి అవాధులు లేకుండా పోయింది. గత ప్రభుత్వం పాలనలో ఏడాది తరబడి బకాయిలతో తల్లులు ఇబ్బందులు పడిన సందర్భాలు గుర్తు చేస్తూ… ఇప్పుడిలా వేగంగా నిధులు చేరడం రాష్ట్రంలోని సాంకేతికంగా మెరుగైన పాలనకు నిదర్శనమని మహిళలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేపట్టిన తల్లికి వందనం పథకం కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా నిలబెట్టే శక్తిగా నిలుస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని నిర్వాహక స్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్న ఎమ్మెల్యే బోండా ఉమాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవుటుపల్లి విజయ కుమారి మాట్లాడుతూ “బాలికా విద్యను ప్రోత్సహించేందుకు, తల్లుల కష్టానికి మర్యాద ఇవ్వాలనే సీఎం చంద్రబాబు సంకల్పానికి ఇది ప్రత్యక్ష ఫలితం. మేమంతా కృతజ్ఞతలతో పాలాభిషేకం చేసి మన ఆనందాన్ని వ్యక్తపరచుకున్నాం,” అని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *