Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ సేవలు విస్తృత పరిస్తాం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆశయాలకు అనుగుణంగా ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడానికి వైస్సార్సీపీ నాయకులు విస్తృతంగా సామాజిక సేవ కార్యక్రమలు చేపడుతున్నారని, అదేవిధంగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో విద్య,వైద్య,ఉపాధి రంగాలలో అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరుగుతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ,ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ తెలిపారు. నియోజకవర్గంలోని 18 వ డివిజన్, రాణిగారితోట నందు రోజు కూలీ చేసుకొనే నిరుపేద కుటుంబానికి చెందిన తమ్మిశెట్టి వాసు,భవాని ల కుమారుడు ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న అవినాష్ వెంటనే స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ ద్వారా వారి కుటుంబ విషయాలు తెలుసుకొని గురువారం వారి నివాసనికి వెళ్లి వారిని పరామర్శించి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు.అదేవిధంగా ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి ఆ బాలుడికి నాణ్యమైన వైద్యం అందజేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ముందుకు వచ్చారన్నారు. ప్రభుత్వం తో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యానికి అయ్యే ఖర్చు అంత సాయమందిచేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదవారి ఉన్నతి కోసం జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు నాయకులు కూడా సామాజిక సేవ కార్యక్రమంల ద్వారా నిత్యం వారికి అండగా ఉండాలనే దిశ నిర్దేశం చేస్తుంటారని,పేదల మీద వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా నిదర్శనం అని అన్నారు.ఆ బాలుడు పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగేవరకు వైస్సార్సీపీ నాయకులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.బాలుడి ఆరోగ్య పరిస్థితి, ముఖ్యమంత్రి సహాయనిధి సాయం గురుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనకు సమాచారం ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందిని అవినాష్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Check Also

ఆంధ్రప్రదేశ్‌లో పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకం ప్రవేశపెట్టడం కోసం AP ఛాంబర్స్ న్యాయవాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరోక్ష పన్నుల వివాదాలకు పరిష్కార పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్స్ ఆఫ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *