Breaking News

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ ఆంధ్ర ప్రదేశ్-ఉత్తర తమిళనాడు కోస్తా తీరాలకు దగ్గరగా పశ్చిమ మధ్య & దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం లలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 4.5 km ఎత్తుల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది.

ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 10°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య ఏర్పడింది.

తేదీ 6 సెప్టెంబర్ 2021 న ఉత్తర మరియు దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం లలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
మరియు విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *