అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే ఆర్కే మంగళవారం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని పరిశీలించారు. నిన్న గాలిగోపురం నుండి పెచ్చులు ఊడి పడ్డాయని తెలుసుకుని ఎమ్మెల్యే దేవాదాయశాఖ అధికారులతో, ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో, MTMC అధికారులతో కలిసి దేవస్థానాన్ని, దేవస్తానం చుట్టూ ప్రక్కల ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. పెచ్చులు ఊడి పడిన తీరును దేవస్థాన EOని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఈ దేవస్థానం దాదాపు 200 వందల సంవత్సరాల క్రితం రాజా శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించినదని దీనిని కాపాడుకోవడం మనందరిపై ఉందని 2012వ సంవత్సరంలో చెన్నై IIT వారు గాలిగోపురం భద్రత దృష్ట్యా గాలిగోపురం చుట్టుప్రక్కల మాడ వీధులలో 4 చక్రాల వాహనాలు రాకపోకలు నిలిపివేయాలని ఒక రిపోర్ట్ ఇచ్చారని అన్నారు. ఇందులో భాగంగా దేవస్థానం చుట్టూ వున్న మాడ వీధులలో 4 చక్రాల వాహనాలు రాకపోకలు నిలిపివేయటానికి MTMC అధికారులతో కలిసి మాడ వీధులను పరిశీలించడం జరిగింది.అనంతరం గుడికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాటు కోసం మరియు ట్రాఫిక్ మల్లింపు విషయాల గురించి MTMC అధికారులతో, పట్టణ CI గార్లతో ఎమ్మెల్యే గారు చర్చించారు. పురాతనమైన ఈ దేవస్థానాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఇందుకు ప్రజలందరూ తప్పకుండా సహకరించాలని అన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …