-నేలపట్టు పక్షుల అభయారణ్యం, ఆటకాని తిప్పా, బివి పాలెం పాయింట్, ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐల్యాండ్ లో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు
-సందర్శకుల కొరకు నేలపట్టు, సూళ్లూరుపేట, బి వి పాలెం వద్ద ఫ్రీ బస్ లు ఏర్పాటు
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలలో డ్రోన్, సి సి కెమెరాలతో నిఘా
-ట్రాఫిక్ నియంత్రణ, సందర్శకుల తాకిడి తట్టుకునేలా భద్రత ఏర్పాట్లు
-జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బరాయుడు
-ఫ్లెమింగో ఫెస్టివల్ కు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి ఏర్పాట్లు
-పెద్ద ఎత్తున సందర్శకులు పాల్గొనాలి ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయండి
-సూళ్లూరుపేట ఎం ఎల్ ఏ నెలవల విజయశ్రీ
సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
గత సంవత్సరం కన్నా మిన్నగా ఈ సంవత్సరం పులికాట్ సరస్సు తీరాన ఆహ్లాదకర వాతావరణంలో జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నామని, పెద్ద ఎత్తున సందర్శకులు కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఈ నెల 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కు సంబంధించి ఏర్పాట్ల పై సూళ్లూరుపేటలోని జెడ్ పి హై స్కూల్ గ్రౌండ్ నందు బుధవారం జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అందమైన పులికాట్ సరస్సు తీరాన ఆహ్లాదకర వాతావరణంలో జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించనున్నామన్నారు. గత సంవత్సరం కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్ల పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి జిల్లా యంత్రాంగం ప్రశంసలు అందుకుందని, అదే స్ఫూర్తితో గత సంవత్సరం కన్నా మిన్నగా రాజకీయ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఈ సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నేలపట్టు పక్షుల అభయారణ్యం, ఆటకాని దిబ్బ, బివి పాలెం పాయింట్ లతో పాటు ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐల్యాండ్ తదితర ప్రదేశాలలో ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీటితో పాటు శ్రీ సిటీ లో జీవ వైవిధ్యం, పచ్చదనం పరిరక్షణ అంశాల పై బాంబే నాచురల్ హిస్టరీ సొసైటీ వారి ద్వారా రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సూళ్లూరుపేట ముఖ్య వేదిక వద్ద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ సిటీ, శ్రీహరి కోట, చేనేత కళాకారులు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బి వి పాలెం బోటింగ్ పాయింట్ వద్ద పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్ వంటి సాహసాత్మక క్రీడలు ఉంటాయన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ లో భాగంగా స్థానిక మత్స్యకారులకు ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా 40 నిముషాలు బోటింగ్ కు రూ.30 మరియు ఇరుక్కుం ఐ ల్యాండ్ కు అప్ అండ్ డౌన్ కు రూ.100 ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహించడంలో తగిన భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూసుకుంటున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా సి సి టి వి కెమెరా లు, డ్రోన్ ల ద్వారా నిఘా ఉంచుతామన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ కు పెద్ద ఎత్తున సందర్శకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కల్పించేలా రోజుకు 3 వేలు చొప్పున రెండు రోజులకు 6 వేల మంది విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో కార్యక్రమంలోని అన్ని అంశాలను చూపించడం జరుగుతుందన్నారు. సందర్శకుల కొరకు నేలపట్టు, సూళ్లూరుపేట, బి వి పాలెం వద్ద ఫ్రీ బస్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేస్తోందని పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించాలని కోరారు.
జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగే అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, సందర్శకుల తాకిడికి తగిన విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలు ఏర్పాటు, టెక్నాలజీ ఉపయోగించి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్ కు వచ్చే సందర్శకులు పోలీస్ శాఖ వారు సూచించిన ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని, అందరి సమిష్టితో ఈ సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయడానికి కృషి చేయాలని అన్నారు.
సూళ్లూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తరువాత 2025 సంవత్సరం లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం జనవరి 10, 11 తేదీలలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం తరఫున చేస్తుందన్నారు. ఈ ఏడాది ఉబ్బలమడుగు జలపాతం, ఇరుక్కం ఐల్యాండ్ లో కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సందర్శకులను అంచనా వేసి బోటింగ్ కు అనువుగా బోటు ల సంఖ్య పెంచడం జరుగుతుందని, బివి పాలెం రిసార్ట్ ల వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఏర్పాటు చేశామని, అదనంగా పారా గ్లైడింగ్ ఏర్పాటు చేశామన్నారు. అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో ట్రైని కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, వేంకటగిరి డి ఎఫ్ ఓ, శ్రీకాంత్, ఆర్ డి ఓ లు శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, సూళ్లూరుపేట మునిసిపల్ చెర్మన్ శ్రీమంత్ రెడ్డి, టూరిజం ఆర్ డి రమణ ప్రసాద్, సూళ్లూరుపేట మునిసిపల్ కమీషనర్ చెన్నయ్య,
డి ఎస్ డి ఓ శశిధర్, సెట్వీన్ సి ఈ ఓ యస్వంత్, ద్వామా పి డి శ్రీనివాస ప్రసాద్, డి ఈ ఓ కుమార్, పారెస్ట్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News