Breaking News

కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో..

-రైతుల కళ్ళలో ఆనందం
-జగన్ ఫోటోల పిచ్చితో రాష్ట్రం సర్వనాశనం
-రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ధ్వజo
-పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతుల ఇళ్లకే పంపిణీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్నింటికి ప్రజల మద్దతు వెల్లు వెత్తుతోందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన బాట పట్టించి, రాజముద్రతో రైతులకు వారి పేర్లతో కొత్తగా జారీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల తో రైతుల్లో ఆనందం నెలకొని ఉందని బుధవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏడాదిలోనే రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో రీ–సర్వే పేరుతో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారని మంత్రి ధ్వజమెత్తారు.జగన్ బొమ్మల తో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేసి వ్యవస్థను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడమే కాకుండా, రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగించి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. రీ–సర్వే ప్రక్రియలో హద్దురాళ్ల ఏర్పాటు పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, హద్దురాళ్లపై కూడా ఫోటోలు ముద్రించి తన బొమ్మల పిచ్చిని జగన్ ప్రజల నెత్తిన రుద్ది పైశాచికత్వం తో ప్రవర్తించిన తీరు క్షమించరానిదని అన్నారు. రాష్ట్రంలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా పంపిణీ జరుగుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో 51,017,తాను ఇన్చార్జి మంత్రిగా ఉన్న నెల్లూరు జిల్లాలో 93,986రాజముద్ర పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 24864, నంద్యాల జిల్లాలో 21470 కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. కొత్త పాస్‌పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూ ఆర్ కోడ్‌తో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక సాంకేతికతతో ముద్రించడం జరిగిందన్నారు. రైతులు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయని, ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేస్తే ఉచితంగా సరిదిద్దుతూ కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకొని, భూసర్వే పూర్తైన తర్వాత పాస్‌పుస్తకాలను నేరుగా రైతుల ఇళ్లకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పంపిణీ చేస్తున్నట్టు మంత్రి ఫరూక్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *