Breaking News

రైజ్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి

– మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త
గుంటుపల్లిలోని రూరల్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సెంటర్ (రైజ్)లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శుక్రవారం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని సందర్శించి, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి, అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, బోధనా విధానాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా వన్ ఫ్యామిలీ – వన్ ఆంత్రప్రెన్యూర్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మహిళలు వ్యాపార అవకాశాలను విస్తృతం చేసుకోవచ్చని సూచించారు. ఇందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శనం, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ మద్దతు వంటి సేవలను రైజ్ కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు.
మహిళలు పారిశ్రామికంగా ఎదగడం అనేది కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా కుటుంబం, సమాజం మరియు దేశ అభివృద్ధికి కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. స్వయం ఉపాధి అవకాశాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని, దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగవుతుందని తెలిపారు. కుటుంబ ఆదాయం పెరగడం వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై మరింత శ్రద్ధ చూపగలుగుతారని, ఫలితంగా కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎ..ఎన్.వి. నాంచారరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
*(డీఐపీఆర్‌వో, ఐ & పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)*

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *