Breaking News

నగరంలో ఎస్ ఎస్ గిఫ్ట్ ఐటమ్స్ ఈవెంట్స్, డెకరేషన్ ఐటమ్స్ షాపు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ షాప్ నూతనంగా ప్రారంభించారు. శుక్రవారం ఏలూరు రోడ్ లో సీతారామపురం జంక్షన్ వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయిన బోండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ షాపు యాజమాన్యానికి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభకార్యాలకు ఈవెంట్స్ నిర్వహించటం డెకరేషన్ చేయడంలో సుమారు పది సంవత్సరాల పైన అనుభవం గల ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ వారు సొంతగా తమ షాపును ప్రారంభించినందున ప్రజలకు మరింత చేరువలో మరింత తక్కువ ధరలకు తమ సేవలను అందించగలరని ఆశించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అతి తక్కువ ధరలలో హోమ్ డెకరేషన్ ఐటమ్స్ ఫంక్షన్లకు వివిధ కార్యక్రమాలకు అవసరమైన సేవలను అతి తక్కువ ధరలకు పొందాలన్నారు.

అనంతరం ఎస్ ఎస్ ఈవెంట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ షాప్ నిర్వాహకురాలు ఎమ్.సునీత మాట్లాడుతూ తమను ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. నూతనంగా ప్రారంభించిన తమ షాపు ను సందర్శించి అతి తక్కువ ధరలు తమకు కావలసిన డెకరేషన్ ఐటమ్స్, అలంకార సామాగ్రి, ఇతర వస్తువులను కొనుగోలు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, షాపు సిబ్బంది, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *