Breaking News

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు తుళ్ళూరు మండలం నేలపాడు గ్రామం ఆర్.డి పరేడ్ గ్రౌండ్ లో జరుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు -2026 కార్యక్రమములో పాల్గొననున్న దృష్ట్యా ముందస్తు పర్యటన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా సూపరిండింటెంట్ అఫ్ పోలిస్ వకుల్ జిందాల్ తో కలసి శుక్రవారం పరిశీలించారు. వేదిక నిర్వహణ సభాస్ధలికి వచ్చు మార్గాలను, వేహిల్ పార్కింగ్ ను సెక్యురిటి ఏర్పాట్ల ను వి.ఐ.పీ వెహికల్ పార్కింగ్, సిటింగ్ ఏర్పాట్లను బారికేట్లను, పబ్లిక్ టాయిలెట్ లను , పబ్లిక్ అడ్రస్ సిస్టం , ఎల్.ఇ.డి.స్క్రీన్స్ ఏర్పాట్లు , విద్యుత్ ప్రసారాలు అంతరాయం లేకుండా, నిరంతర విధ్యుత్ అందించే ఏర్పాట్లపై సంబంధింత అధికారులనుండి తెలుసుకొని తగిన సూచనలు అందజేశారు. ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తీ చేయాలనీ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు , మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనీ సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాసరావు, అడిషినల్ ఎస్.పీ లా అండ్ ఆర్డర్ ఎ.పీ.వి.రవి కుమార్, అడిషినల్ ఎస్.పీ మల్లికార్జున రావు, సిఆర్ డి.ఎ. ఇ.ఇ. ఎ. వెంకటేశ్వరరావు , సిఆర్ డి.ఎ పీ.డి విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు ఎస్.ఓ, మంగళగిరి, ఆర్. అండ్ బి ఇఇ సి విశ్వనాద్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ ఎ. వెంకట్, ఆర్.అండ్ బి ఎ.ఇ ఎం. అరుణ కుమార్, ఎన్.ఐ.సి. డి.ఐ.ఓ పీ. మోహన రాగిణి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు వెళ్లాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు బకాయి ఉన్నపన్ను వసూళ్లకు యుద్దప్రాతిపదిక యాక్షన్ ప్లాన్ మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *