గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాలెట్ బాక్స్ లు సురక్షితంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే వరకు జోనల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ జోనల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రూట్ ఆఫీసర్స్ మరియు జోనల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలోని అన్ని పోలింగ్ స్టేషన్లకు కేటాయించిన బస్సులు ఆ రూట్లోనే వెళ్తుంది లేనిది రూట్ ఆఫీసర్స్ తనిఖీ చేసుకోవాలన్నారు. బస్సు లు నిర్దేశించిన రూట్ మ్యాప్ ప్రకారం మాత్రమె పోలింగ్ స్టేషన్లకు వెళ్లాలని రూట్ ఆఫీసర్స్ ను ఆదేశించారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో పి.ఓలు ఏ.పి.ఓ లు నైట్ ఉంటారు కాబట్టి వారి వద్ద నుండి ఎటువంటి కంప్లైంట్ లేకుండా, వారికి అవసరమైనా అన్ని సదుపాయాలూ పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేయించాలన్నారు. ఈ నెల 27న ఆంధ్ర ముస్లిం కాలేజీలో మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని, విధులు కేటాయించబడిన అధికారులు ఉదయం 5.30 గంటలకు విధులకు హాజరు అయ్యి పి.ఓ లు ఏ.పి.ఓ లకు ఉదయం 11 కల్లా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో కూడా ఎటువంటి గందరగోళం లేకుండా ప్రణాళికాకాబద్దంగా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఎలక్షన్ మెటీరియల్ తీసుకున్న అనంతరం నిర్దేశించిన చెక్ లిస్టు ప్రకారం మెటీరియల్ తనిఖీ చేసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు ఏర్పాటు చేయుట జరిగిందని, పోలింగ్ పూర్తైన అనంతరం మరల బ్యాలెట్ బాక్స్ లను పోలింగ్ స్టాఫ్ ను నిర్దేశిత మ్యాప్ ప్రకారం యూనివర్సిటీకి తీసుకువచ్చి, బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచాలన్నారు. సంబంధిత రూట్ లో ఉన్న ప్రతి పోలింగ్ స్టాఫ్ అందరు బస్సు ఎక్కిన తరువాత మాత్రమె బస్సులు కౌంటింగ్ సెంటర్ కు బయలుదేరాలని అధికారులను ఆదేశించారు. జోనల్ అధికారులు, రూట్ అధికారులు వారికి నిర్దేశించిన పోలింగ్ స్టేషన్లలోని ఆర్.ఓ లతో కలిసి ఈ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యలేమైనా వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేసి, సమస్య వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశం నందు అదనపు కమిషనర్ ఐ. కిశోర్, సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, డిసిపి సూరజ్ కుమార్, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, ఎలక్షన్ సెల్ సూపరింటేన్దేట్ పద్మ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రూట్ ఆఫీసర్స్ మరియు జోనల్ అధికారులతో ప్రత్యేక సమావేశం
