-కౌన్సిల్ తీర్మానం ప్రకారం వారి కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లింపు
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగములో అవుట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న దేవర రామలక్ష్మి ది.01-11-2021 తేదిన నైట్ శానిటేషన్ నిర్వహిస్తున్న సమయంలో వెనుక నుండి లారీ గుద్దడముతో ప్రమాదానికి గురై సంఘటన స్థలములోనే మరణించుట జరిగిన దర్మిలా డిసెంబర్ నందు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించుట జరిగిందని, వారి యొక్క ఆర్ధిక పరిస్థితులను దృష్ట్యా రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించుటకు కౌన్సిల్ వారు ఆమోదించిన దర్మిలా మిగిలిన రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెక్కు శనివారం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 64వ డివిజన్ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ తో కలసి రామలక్ష్మి కుటుంబ సభ్యులు భర్త సన్యాసి అప్పడు మరియు కుమార్త దేవర సౌజన్య లకు అందించుట జరిగింది.