-చేనేత జౌళి శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి
-గాంధీనగర్ రైస్ మిల్లర్స్ హాలులో చేనేత ప్రదర్శన ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత రంగాన్ని ప్రోత్సహించటంలో చేనేత సేవా కేంద్రం కార్యక్రమాలు ఎంచదగినవని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండి చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడ గాంధీనగర్ లోని రైస్ మిల్లర్స్ అసోసిషియేషన్ హాలులో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ఆదివారం నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ చేనేత కార్మికులకు సంవత్సరమంతా పూర్తిస్ధాయి పని లభించగలిగేలా నిరంతరం చేనేత ప్రదర్శన, అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. రెండు రోజుల క్రితం ముగిసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన నగర ప్రజల నుండి మంచి ఆదరణను చూరగొందని, రూ. 4 కోట్ల వరకు అమ్మకాలు నమోదు చేసుకుందని వివరించారు. చేనేత సేవా కేంద్రం ఇన్ చార్జి హిమద్ కుమార్ మాట్లాడుతూ విభిన్న ప్రాంతాల చేనేత వస్త్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకులు మైసూర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.