గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన అమరవీరుల దినోత్సవం షహీద్ దివస్ ను నిర్వహించారు. ఈ సందర్భముగా ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న ముందుగా స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు చిత్ర పటాలకు పూలమాలలతో నివాళులర్పించిన తరువాత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మాతృభూమి కోసం మరణించాలనే వారి త్యాగం ఎల్లప్పుడూ దేశప్రజలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఇదే స్ఫూర్తి తో స్వాతంత్య్ర ఉద్యమం జరిగిన సమయం లో ప్రతి దిశలో, ప్రతి ప్రాంతంలో, నిరంతరం మేల్కొల్పే పని దేశంలోని ప్రతి మూలలోని ఏంతో మంది స్వంతంత్రయ ఉద్యమ కారులు, మహిళలు మరియు యువకులు అసంఖ్యాక త్యాగాలుతో చేశారని అన్నారు. ఎంతో మంది స్వాతంత్ర యోధుల త్యాగ ఫలితం మనం అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరు వారి త్యాగ స్పూర్తితో దేశ భక్తి ని పెంపొందించుకుని ప్రపంచ పటంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలపాలి అన్నారు. అలాగే ఈ 75 సంవత్సరాలలో భారతదేశంలో మరియు విదేశాలలో మనము ఎన్నో విజయాల సాధించి నిరూపించుకున్నాము అని, మన రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య సంప్రదాయాలు ఉన్నత విలువలతో కూడినవి అని ఆయన అన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భముగా హాజరైన వారందరి తోముఖ్య అతిధి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం లో అతిధులుగా పాల్గొన్నా నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి, షేక్షావలి, ప్రోగ్రాం అసిస్టెంట్లు బుర్రా సీతారాం మరియు వినయ్ కుమార్ ప్రసంగిచారు. అలాగే ఈ కార్యక్రమము లో యువతకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రశంసాపత్రాలు మరియు బహుమతులు అందజేశారు. ఈ కార్య క్రమములో యువజన సంఘాల సభ్యులు మరియు గుంటూరు నెహ్రు యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …