అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
జపాన్‌లోని ఐచి–నగోయాలో జరుగుతున్న 5వ ఆసియా పారా గేమ్స్–2026లో షాట్‌పుట్ (F40 విభాగం) పోటీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రొంగాలి రవి అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు రొంగలి రవి నీ హృదయపూర్వకంగా అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా వేదికపై తన ప్రతిభను చాటుకుని, ఆసియా పారా గేమ్స్–2026లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో పతకాన్ని అందించిన రొంగాలి రవి విజయం రాష్ట్రానికి గర్వకారణమని రవి నాయుడు గారు పేర్కొన్నారు. కఠోర శ్రమ, పట్టుదల, అంకితభావంతో రవి సాధించిన ఈ విజయం రాష్ట్రంలోని ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
రొంగాలి రవి భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని రవి నాయుడు గారు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని మరింత పెంపొందించాలని ఆయన అభిలషించారు.
