Breaking News

“మానవఅక్రమ రవాణా- నిరోధంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల పాత్ర”

నరసరావుపేట,  నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లాలో మానవ అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి ” జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్” కృషిచేస్తుందని ఇందుకై జిల్లాలోని మహిళా సంరక్షణ కార్యాదర్సుల పాత్ర చాలా ముఖ్యమని జిల్లా మానవ అక్రమ రవాణా ఇంచార్జి విజయకృష్ణ అన్నారు. నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో రూరల్ పోలీసుస్టేషన్ లోని సమావేశ మందిరంలో హెల్ప్ సంస్ధ మరియు జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ ఆధ్వర్యంలో ” మానవఅక్రమ రవాణా- నిరోధంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల పాత్ర” అనే అంశంపై సమావేశం జరిగింది.

ఇటీవల పల్నాడు జిల్లా క్రైమ్ కంట్రోల్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. విజయకృష్ణ సారధ్యంలో జిల్లా స్థాయి మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ ప్రారంభించటం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న, టి. విజయ కృష్ణ మాట్లాడుతూ నేరాలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేసి విచారణ జరపడం కన్నా ఆ నేరాలు జరగకుండా ముందుగానే నిరోధించటం చాలా ముఖ్యం అని అన్నారు.ఇందుకోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు, తమ గ్రామాలలో అత్యంత పేదరికం, ఇబ్బందులతో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి ముందుగానే కౌన్సెలింగ్ చేయటం, నిరంతరం వారికి తోడుగా, అండగా ఉండటం ద్వారా ఆ కుటుంబాల నుండి ఎవ్వరు అక్రమ రవాణా కు గురికాకుండా నిరోధించవచ్చు అన్నారు..

ఈ సమావేశంలో హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్ అక్రమ రవాణా నిరోధం అనే అంశంపై శిక్షణ, అవగాహన కల్పించారు.

జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్. విజయకుమార్ మాట్లాడుతూ బాలల హక్కుల చట్టం గురించి వివరిస్తూ మహిళా సంరక్షణ కార్యదర్శులు, తమ పరిధిలోని గ్రామ వలేంటర్లు ద్వారా ఆ గ్రామంలోని అత్యంత పేదవారు వివిధ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను గుర్తించి వారి సమస్యలు గురించి జిల్లా బాలల సంరక్షణ శాఖ దృష్టికి తీసుకొని రావాలని కోరారు.

జిల్లా చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ కె. సమీర్ కుమార్ ఆపదలో ఉన్న బాలల కోసం ఏర్పాటు చేసిన 1098 ఉచిత టెలిఫోన్ సేవలు గురించి వివరిస్తూ మీ గ్రామాలలో ఈ సేవలు గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు..

హెల్ప్ ప్రోగ్రాం మేనేజర్ వి. భాస్కరరావు, జిల్లా లీగల్ ప్రొబేషన్ అధికారిణి వాసంతి, డీసీపీ యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్ బత్తుల, మానవ అక్రమ రవాణా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *