విజయవాడ ఉత్సవ్‌లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎంపీ కేశినేని చిన్ని చేతుల మీదుగా బహుమతుల ప్రదానం

-విద్యార్థులు, యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయి: ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో, కేశినేని ఫౌండేషన్ మరియు జిజ్ఞాస ఆర్ట్స్ వర్క్స్ సంయుక్తంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గురువారం రామవరప్పాడు రింగ్ వద్ద సర్వీసు రోడ్ లో ఉన్న ఎం కన్వెన్షన్ నందు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొని, వివిధ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు.

విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా మొత్తం ఏడు విభాగాల్లో వందకు పైగా పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రతిభావంతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారిని ఎంపీ కేశినేని చిన్ని అభినందించి, బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ..

విజయవాడ నగరంలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, విద్యార్థులు, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా వివిధ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

విజయవాడ నగరాన్ని సాంస్కృతిక, కళా, క్రీడా రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, కేశినేని ఫౌండేషన్, జిజ్ఞాస ఆర్ట్స్ వర్క్స్ సంయుక్తంగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పోటీల్లో విజయం సాధించిన వారితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులేనని తెలిపారు.గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ, తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకోవాలని విజేతలకు సూచించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, విజయవాడ నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విజయవాడ ఉత్సవ్ ద్వారా నగర ప్రజలకు వినోదంతో పాటు కళలు, సంస్కృతి, సృజనాత్మకతకు సంబంధించిన అనేక కార్యక్రమాలను అందించగలిగామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి, సొసైటీ ఫర్ వైబ్రేoట్ విజయవాడ సభ్యులు విజయవాడ ఉత్సవ్ సభ్యులు జిజ్ఞాస ఆర్ట్ వర్స్ సభ్యులు పాల్గొన్నారు