కూటమి విజయానికి కృషి చేయాలి …

-బుద్ధా వెంకన్న, చెన్నుపాటి శ్రీనివాస్

భవానీపురం, నేటి పత్రిక ప్రజావార్త:
రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ప్రముఖ నాయకులు చెన్నుపాటి శ్రీను పిలుపునిచ్చారు. భవాని పురం, శివాలయం సెంటర్ వద్ద గురువారం 38వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి పత్తి నాగేశ్వరరావు నూతన ఎన్నికల కార్యాలయాన్ని వారు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో ముందుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. 38వ వార్డు పరిధిలోని ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను వివరించాలని కోరారు. పత్తి నాగేశ్వరరావు భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, నియోజకవర్గ ముఖ్య ప్రతినిధులు, కార్యకర్తలు మరియు కూటమి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.