నేటి పత్రిక ప్రజావార్త :
విష్ణువు మూర్తి యొక్క అద్భుతమైన విగ్రహం ఒకటి కర్ణాటకలో సక్లేషపూర్ అనే గ్రామంలో గ్రామస్తులు వేటి గురించో తవ్వుతూ బయటపడింది. అదృష్టవశాత్తూ తవ్వకాలలో ఎక్కడా దెబ్బ తగలకుండా విగ్రహం పూర్తి రూపంతో అద్భుతమైన స్థితిలో ఉంది. ఇది హొయసల కాలంలో చెక్కబడిన వాసుదేవుడు లా కనిపిస్తున్నాడు. చుట్టూ వున్న అర్చి వంటి దానిలో అందమైన సూక్ష్మ మైన దశావతారాలను కూడా చెక్కారు గమనించండి! అప్పటి విదేశీయుల దండయాత్రలు నుండి కాపాడుకుందికి బహుశా భూమి లోతుల్లో ఇసుక పారల మధ్య ఈ విగ్రహాన్ని భద్రంగా దాచి ఉంటారని అందుకే పూర్తి రూపంలో లభించింది అని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు.