కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి: ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 17 14, 13 డివిజన్లకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది అని దేవినేని అవినాష్ అన్నారు. అభ్యర్థిగా మేయర్ అభ్యర్థి తో పాటు 17,14, 13 డివిజన్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పర్వతనేని పవన్,బోను శారదా, ఎమ్.నందిని విజయం కోసం ఈరోజు ఇంటింటి ప్రచారం చేపట్టాము ని పేర్కొన్నారు.ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్తుంటే, గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించే ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు.
గత రెండున్నర సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా, చేస్తామన్న అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేశారు.ఆరోజు కౌన్సిల్‌లో జమాక్ లాంటి ప్రాంతంలో వాటర్ సప్లై ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే, తాము అధికారంలోకి రాగానే అది తమ బాధ్యత అని కూటమి నాయకులు చెప్పారు. లీటర్ నీటిని రూ. 3 లకే ఇస్తామని చెప్పి, ఇప్పుడు దానిని రూ. 35 లకు పెంచి జమాక్ ప్రజలను తీవ్రంగా మోసం చేశారు.అన్ని ప్రాంతాల్లోనూ శానిటేషన్ సమస్యలు వేధిస్తున్నాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.చంద్రబాబు నాయుడు విజయవాడ నగరాన్ని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ముంచేస్తున్నారు. నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. రైస్ బ్యాగ్ ధర ఏకంగా రూ. 2,300 నుండి రూ. 2,500 వరకు పెరిగిపోయింది. ‘మాది మంచి ప్రభుత్వం’ అని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, ప్రజల దృష్టిలో ‘ముంచిన ప్రభుత్వం’గా మిగిలిపోయింది.ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను, మేయర్‌ను గెలిపించాలి. విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మేయర్ అభ్యర్థిగా రాయన భాగ్యలక్ష్మిని, అలాగే 86 డివిజన్లలో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అవినాష్ కోరారు.