Breaking News

మాండూస్ తూఫాన్ సహాయక చర్యలు పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి

-ఆస్తుల పంట నష్టానికి చెందిన అంచనాలు సిద్ధం చేస్తున్నారు
-లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మండోస్ తుఫాను కారణంగా రాష్ట్రంలోనే తిరుపతి జిల్లాలో అత్యధిక వర్ష పాతం ఉదయం వరకు నమోదైందని, జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నేటి ఉదయానికి మొత్తం 34 మండలాలలో దాదాపు 200 ఎం.ఎం కంటే ఎక్కువగా 10 మండలాల్లో, 150 ఎం.ఎం కంటే మించి 20 మండలాల్లో వర్షపాతం నమోదైందని తెలిపారు. నేటి ఉదయం నుంచి కొచెం తగ్గు ముఖం కనపడుతోందని, అయినప్పటికీ కూడా కోస్టల్ మండలాలు మరియు శ్రీకాళహస్తి, సూళ్ళూరు పేట , గూడూరు మూడు డివిజన్లకు చెందిన మండలాలలో అత్యధిక వర్షపాతం నమోదయిందని, కొన్ని కాజ్వేలు పొంగి ప్రవహిస్తున్నాయని అక్కడ రెవెన్యు, పోలిస్ యంత్రాంగాన్ని సిద్దంగా ఉంచి అక్కడ ఎవ్వరూ కూడా వాహన దారులను రానియ్యకుండా చూస్తున్నామని, ఎటువంటి ప్రాణ నష్టం ఇప్పటివరకు జరగలేదని, జంతువులు మాత్రం రెండు ఎద్దులు,రెండు గొర్రెలు, రెండు ఆవులు చనిపోవడం జరిగిందని అన్నారు. ఇవి కూడా కొట్టాలలో ఉండడంతో వర్షానికి కొట్టం కూలిపోయి మరణించడం జరిగిందన్నారు. ఆస్తి నష్టానికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, రెవెన్యు యంత్రాంగం వీటిపై సర్వే మొదలు పెట్టారని తెలిపారు. ఇప్పటి దాక నాలుగు ప్రదేశాల్లో బాలాయపల్లి, రేణిగుంట, తడ, తిరుపతి లలో రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగిందని, ఈ నాలుగు చోట్ల ఇప్పటివరకు 264 మందిని సురక్షితంగా తరలించి వారికి ఆహరం నీరు సరఫరా చేయడం జరుగుతోందని తెలిపారు. ఉదయం అందిన సమాచారం మేరకు తిరుపతి కాలనీలో సుమారు 50 ఇళ్ళలోకి నీరు చేరడం జరిగిందని, వెంటనే తమిళ స్కూల్ లో ఒక రిలీఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 70 మంది వరకు తరలింఛి వారికి కావలసిన అవసరాలను చూస్తున్నామన్నారు. తిరుపతి నగరంలో గతంలో వచ్చిన వరదల అనుభవంతో నగరంలో అన్ని చోట్ల ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ నీటిని నిలబడకుండా ఫ్లో అయ్యేలా డ్రైనేజీ వ్యవస్థ పై ఎప్పటికప్పుడు మునిసిపల్ అధికారులతో చర్యలు చేపట్టామని అన్నారు. ఎటువంటి రోగాలు ప్రబలకుండా ఈ రోజు సాయంత్రం లోపల సానిటేషన్ చేయవలసినదిగా మునిసిపల్ అధికారులను, డి.పి.ఓ కు సూచనలు ఇవ్వడం జరిగి౦దని అన్నారు. డి.ఎం.హెచ్.ఓ ను మరియు ఆరోగ్య శాఖాధికారులను అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండవలసినదిగా ఆదేశించామన్నారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ లో నష్టపోయిన రైతులు వాటిపై రిపోర్ట్ ను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. ఇవి కాకుండా ఇటివలే పంటలు వేసిన వాళ్ళు నష్టపోకుండా వారికి మళ్ళీ విత్తనాలు అందించే విధంగా ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు తమకు వచ్చాయని తెలిపారు. 80 శాతం సబ్సీడితో విత్తనాలను అందిస్తున్నామని తెలిపారు, ప్రదానంగా అరనియర్, కాళంగి ,మల్లెమడుగు, కల్యాణి డ్యాం వీటిని కూడా ప్రతిక్షణం మానిటర్ చేయడం జరుగుతోందని తెలిపారు. అరనియార్ కి సంబంధించి ఉదయం వరకు ఇన్ ఫ్లో 4795 క్యూసెక్కులు ఉన్నదని, అవుట్ ఫ్లో లేదని ఐతే ఇన్ ఫ్లో కి సంబంధించి వస్తున్న ప్రాంతాల్లో కాజ్వేస్ అన్ని మునిగి వున్నాయని అక్కడ కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, స్పెషల్ ఆఫీసర్స్ ని కూడా నియమించడం జరిగిందని వారు వెళ్లి అక్కడ రోడ్లు, కల్వర్టులు ఏమైనా డ్యామేజి జరిగిందా, తద్వారా ఆ గ్రామాలు ఐసోలేషన్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయా అని ఒకవేళ ఇసోలేట్ అయ్యే పరిస్థితి ఉంటె వెంటనే వాటిపై చర్యలు తీసుకొని పునరుద్దరించే పరిస్థితి కల్పించామని తెలిపారు. అదేవిదంగా కాళంగి కి సంబంధించి ఉదయం వరకు అవుట్ ఫ్లో 15000 క్యూసెక్కులు ఉన్నాయని , వీటికి సంబంధించి లోతట్టు ప్రా౦తాలలో ఉన్నటువంటి గ్రామాల్లో రెండు రోజుల నుంచే ముందస్తుగా అలర్ట్ చేస్తున్నామన్నారు. జయలక్ష్మి పురం వద్దనున్న కాజ్వే కూడా రవాణాకు ఇబ్బందిగా ఉన్నదని అక్కడ అధికారులను పెట్టి వాహన దారులను పోనియ్యకుండా చూస్తున్నామని తెలిపారు.ఎక్కడైతే తాత్కాలిక రోడ్లు కూడా లేవో అక్కడ వెంటనే కల్వర్టులను ,రోడ్లు ను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. మల్లెమడుగు లో కూడా నేటి సాయంత్రం దాదాపు 4 గేట్లను నాలుగు అడుగులు పైకి ఎత్తడం జరిగిందని ఇప్పుడు 8000 క్యూసెక్కులు దాక అవుట్ ఫ్లో ఉందని , అటు వైపున ఉన్న వెదల్ల చెరువు ఎస్టి కాలని ని ముందు రోజే ఖాళీ చేయించి 30 మందిని సురక్షిత ప్రా౦తాలకు తరలించడం జరిగిందని తెలిపారు. కల్యాణి డ్యాం నుంచి నేటి సాయంత్రం వరకు అవుట్ ఫ్లో 10 క్యూసెక్కులని ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. స్వర్ణముఖి బ్యారేజి వాకాడు ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 18000 ఉందనీ 9 గేట్లు ఎత్తారని అన్నారు. అన్నింటిని కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ వెళుతున్నామని ఇప్పటి వరకు అందరి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని, అదేవిదంగా పంచాయతి రాజ్ , ఆర్.అండ్ బి ,రెవెన్యు యంత్రాంగం , ఆర్.డి.ఓ అందరూ కూడా వర్ష ప్రభావంతో జరిగిన డ్యామేజస్ పై సమగ్ర నివేదిక తయారు చేయల్సినదిగా సూచించామని అన్నారు. పంచాయతి రాజ్ కు సంబందించిన వారు సానిటేషన్ , రోగాలు ప్రభాలకుండా వైద్య శాఖాధికారులను ఇలా ప్రతి శాఖల వారిని అప్రమత్తం చేసామని, అందరు ఫీల్డ్ లో ఉన్నారని , రాత్రి వీచిన గాలులకు కొన్ని స్తంభాలు నేలకోరిగాయని వాటిని పునరుద్దరించడం జరిగిందని, ప్రజలెవ్వరు భయ బ్రా౦తులకు గురి కావాల్సిన అవసరం లేదని ఏదైనా సమస్య ఉంటె కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి తెలపాలని అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *