Breaking News

ఎన్‌టిఆర్‌ జిల్లా (పశ్చిమ కృష్ణా శాఖ) ఏపిఎన్‌జివో సంఘ ఎన్నికల షెడ్యూలు విడుదల

-ఈనెల14న నామినేషన్ల స్వీకరణ 28న ఎన్నికలు
-ఎన్నికల అధికారి బి. జానకి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28న తేదిన నిర్వహించనున్న ఏపిఎన్‌జివో అసోసియేషన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా (పశ్చిమ కృష్ణా) శాఖ కార్యవర్గ ఎన్నికలకు 14న నామినేషన్ల స్వీకరించేందుకు ఎన్నికల నోటీఫికేషన్‌ విడుదల చేసిన్నట్లు ఎన్నికల అధికారి బి. జానికి ప్రకటనలో తెలిపారు. ఏపిఎన్‌జివో అసోసియేషన్‌లో ఎన్‌టిఆర్‌ జిల్లా (పశ్చిమ కృష్ణా) శాఖ కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి ఒక అధ్యక్ష పదవి, ఒక సహాధ్యక్ష పదవి, ఐదు ఉపాధ్యక్ష పదవులు, ఒక కార్యదర్శి, ఒక కార్యనిర్వహక కార్యదర్శి, నాలుగు సంయుక్త కార్యదర్శులు, ఒక మహిళా సంయుక్త కార్యదర్శి, ఒక కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్‌ 14వ తేదిన మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గాంధీ నగర్‌లోని ఏపిఎన్‌జివో నందు నామినేషన్‌లు స్వీకరించడం జరగుతుందని అనంతరం నామినేషన్‌లను పరిశీలించి అర్హత గల నామినేషన్‌ జాబితాను సిద్దం చేస్తామన్నారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నామినేషన్‌ ఉప సంహరణ గడువుగా నిర్థారించడం జరిగిందన్నారు. రాత్రి 8.30 నిషాలకు పోటీలలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 28వ తేది ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నిర్వహిస్తామని అనంతరం కౌంటింగ్‌ నిర్వహించి గెలుపు పొందిన అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొనే అభ్యర్థులు ఒక్కొక్క పదవికి 300 రూపాయల నామినేషన్‌ రుసుము కింద చెల్లించాలని, నామినేషన్‌ రుసుము తిరిగి చెల్లించబడదన్నారు. ఏపిఎన్‌జివో అసోసియేషన్‌ అమరావతి శాఖ కార్యదర్శి బి. తులశీరత్నం, సహాయ ఎన్నికల అధికారిగా, కోశాధికారి ఏ. రంగారావు ఎన్నికల పరిశీలుకులుగా వ్యవహరిస్తారని ఎన్నికల అధికారి బి. జానకి ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *