Breaking News

50,000 రూపాయల కుట్టు మిషన్ వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది అనే నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీ ని గెలిపించి అధికారం అప్పజెప్పితే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారు రాష్ట్రాన్ని అన్నివిధాల దోచుకొని సామంతులు మాదిరిగా వ్యవహిరించారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. అందుకే అరాచక పాలనకు ప్రజలు విసుగుచెంది జగన్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించారని అదేరితిలో నేడు ఆయన జనరంజకం పాలన అందిస్తుంటే ఓర్వలేక టీడీపీ నాయకులు ఇదేమి ఖర్మ అంటూ రోడ్డున పడ్డరని ఎద్దేవా చేశారు. విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ  స్పూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వైయన్ఆర్ చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న యలమంచిలి జయ ప్రకాష్ సేవలు అభినందనీయం అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం  వై.యన్.ఆర్ చారిటీస్ ద్వారా 8వ డివిజన్, ఫిటింగులపేట కు చెందిన గురివిందపల్లి రవి కి జీవనోపాధి నిమిత్తం జ్యూకి కుట్టుమిషన్ ను తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ చేతులుమీదగా అందించారు.ఈ సందర్భంగాఅవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ  హయం నుండి కూడా యలమంచిలి జయ కు మా కుటుంబంతో ఉన్న సన్నిహిత్యంతో తాను చేపట్టే ప్రతి సామాజిక సేవ కార్యక్రమంలలో నన్ను భాగస్వామినీ చేయడం సంతోషంగా ఉందని, నాన్న దేవినేని నెహ్రు  సేవా స్పూర్తితో తన చారిటీ సంస్థ ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధి, విద్య రంగాలలో అండగా నిలిచిన వారి సేవలు అభినందనీయం అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా వారి సేవ కార్యక్రమాలు ఇలాగే నిరాటంకంగా జరగాలని వారికి నా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ఇంచార్జ్ యలంనుంచిలి జయప్రకాశ్, పొట్లూరి రవి, కొల్లి రవి, ధనశేఖర్, ఝాన్సీ, పాల్వాయి రవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *