విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, టెక్ ఇన్ ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఎంబీఏ విభాగం సహకారంతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేశ్ తెలిపారు. టెక్ ఇన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు, కళాశాల సమన్వయకర్తగా డా. మేకా రమేశ్ మూడేళ్ల కాలపరిమితితో కూడిన ఎం.ఓ.యూ.పై శనివారం సంతకాలు చేశారు. యూజీ, పీజీ విద్యార్థుల ఉపాధి శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి, రెజ్యూమే రూపకల్పన, సదస్సులు, సమావేశాలు, అధ్యాపన అభివృద్ధి కార్యక్రమం, వర్క్ షాపులు, ఇంటర్న్ షిప్, పరిశ్రమల అవసరాల మేరకు ప్రత్యక్ష కృత్యాలు మొదలైన అంశాల్లో టెకిన్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుందని, మార్గనిర్దేశకత్వం చేస్తుందని డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ రాజేశ్ సి.జంపాల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.బి.ఎ. అధ్యాపకులు డా.రహమాన్, ఉపాధి కల్పన విభాగం అధికారి కావూరు శ్రీధర్ పాల్గొన్నారు.
టెకిన్ సంస్థతో పి.బి. సిద్ధార్థ ఒప్పందం
