Breaking News

ఎన్నికల విధులలో అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధులలో అధికారులు తహశీల్దార్లు ఎన్నికల నియమావళి తప్పనిసరి పాటించాలని చిన్న పొరపాటుకు కూడా తావివ్వరాదని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారo సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్ లు, జె.సి. లు, డి.ఆర్.ఓ.లతో వర్చువల్ విధానంలో మండలి ఎన్నికల నిర్వహణపై సమీక్షించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జెసి డి.కె. బాలాజీ, డి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, ఆర్.డి.ఓ. లు హాజరయ్యారు. వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎన్నికల రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యుషన్ సెంటర్ల నుండి పోలింగ్ కేంద్రాలకు తరలించే మెటీరియల్ లను చెక్ లిస్టు ఆధారంగా పంపాల్సి ఉంటుందని అన్నారు. రిసెప్షన్, డిస్ట్రిబ్యుషన్ సెంటర్ల యందు లైటింగ్ ఏర్పాట్లు చూడాలని అన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులకు సిబ్బందికి మార్చి 1, 9 తేదీలలో రెండు సార్లు శిక్షణ ఇవ్వాలని ఈ శిక్షణ బాధ్యతలు రిటైర్డ్ జె.సి. వి.ఆర్. చంద్రమౌళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోదండ రామి రెడ్డి పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణ ఉండాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులను మరో సారి పరిశీలించి పెయింటింగ్ వంటివి చూడాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు అందితే 24 గంటల లోపు ఎన్నికల కమీషన్ కు ఆ ఫిర్యాదులకు సమాధానాలతో పాటు అందించాల్సి ఉంటుందని సూచించారు. ఈ నెల 23 నాటికి నామినేషన్ల స్వీకరణ ఆఖరు రోజని ఆరోజుకి ఎన్నికల కమీషన్ సూచించిన విధంగా పెండింగ్ లేకుండా క్లెయిముల పరిష్కారం జరగాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. లు కనకనరసా రెడ్డి, కిరణ్ కుమార్, రామారావు, చంద్రముని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, తహశీల్దార్లు హాజరయ్యారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *