Breaking News

స్పందనలో అర్జీలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి

-ప్రభుత్వ పథకాలు అమలలో భాగంగా క్షేత్రస్థాయిలో త్వరలో జిల్లాలలో పర్యటించనున్న జిల్లాల ప్రత్యేక అధికారులు
-ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఆర్జీలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం పూనం మాలకొండయ్య అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నారాయణ భరత్ గుప్త తో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ… నవరత్నాల కార్యక్రమo లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలలో ఆయా శాఖల ద్వారా ప్రజల శ్రేయస్సు పట్ల నిబద్ధతను పొందించడంతో పాటు ప్రజల సమస్యలను విని సమస్యలను సకాలంలో పరిష్కరించే దిశగా నాణ్యమైన సేవలను సంతృప్తస్థాయిలో అందించడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా అందుతున్న అర్జీలను నాణ్యవంతంగా పరిష్కరించడం దిశగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్పందనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక అనాలసిస్ చేశామని, ఇందులో రెవెన్యూ, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం శాఖలకు సంబంధించి అర్జీలు తరచు ఎక్కువగా గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలలో స్పందనలో అర్జీలు ఎక్కువగా వస్తున్న మొదటి ఐదు శాఖలను గుర్తించాలని చెప్పారు. రెవిన్యూ, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, గృహ నిర్మాణం వంటి శాఖల పై తరచూ క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్పందనలో ఏ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, ఎందులో వస్తున్నాయి, ఏ శాఖకు సంబంధించి ఎక్కువగా వస్తున్నాయి తదితర అంశాలలో జిల్లాస్థాయి అనాలసిస్ ను రూపొందించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా ఒక్కో జిల్లాకు ఒక్కో ఐఎఎస్ అధికారిని మొత్తం 26 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా నాడు నేడు నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు, జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం, వీలేజ్ హెల్త్ క్లినిక్, హాస్పిటల్స్ , గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల పనితీరును పరిశీలించేందుకు ప్రత్యేక అధికారుల నియమాకాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాలలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాకు ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శిని నియమించారని తెలిపారు. జిల్లాలో ప్రతి సచివాలయంలో సచివాలయ సిబ్బంది 3 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డి ఎల్ డి ఓ సుశీలమ్మ, సచివాలయం కోఆర్డినేటర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *