-తిరుపతి ఎస్ డి హెచ్ ఆర్ కాలేజీలో మే6న ఆన్లైన్ పరీక్ష: కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో హెచ్ సిఎల్ -టెక్ బీ (HCL TechBee program) కార్యక్రమం నందు 12వ తరగతి (మాథ్స్/బిజినెస్ మాథ్స్ లో) పూర్తి చేసిన అభ్యర్థులకు ఐటి రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించే ముందస్తు ట్రైనింగ్ ప్రోగ్రాంలో భారతదేశపు అతిపెద్ద IT కంపెనీలో ఒకటైన HCL తో అనుబంధం పొందడానికి ఇది ఉత్తమ అవకాశం అని ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు శిక్షణ ఎంపికకు ఉండాల్సిన అర్హతలు
✓ఇంటర్మీడియట్ నందు 2021/2022వ సంవత్సరంలో 60% మార్కులతో ఉతిర్ణత సాధించిన విద్యార్థులు మరియు 2023 వ సంవత్సరంలో 75% మార్కులతో ఉతిర్ణత సాధించిన విద్యార్థులు ఈ ప్రోగ్రాం కి అర్హులు.
✓అర్హులైన అభ్యర్ధులు HCL TechBee వెబ్సైట్ లో ముందుగా రిజిస్టర్ చేసుకోవలెను. రిజిస్టర్ చేసుకున్న అనంతరం వాళ్ళకు HCL నుండి మెయిల్ వస్తుంది. HCL నుండి శుభాకాంక్షలు చెప్తు వచ్చిన మెయిల్ లో అప్లికేషన్ కి సంబంధిత లింక్ పైన క్లిక్ చేసి, అప్లికేషన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లో అభ్యర్థికి సంబందించిన వివరాలు మరియు అభ్యర్ధి యొక్క ఫోటో, ఆధార్ కార్డ్, సంతకం,10వ తరగతి మార్క్స్ లిస్ట్ మరియు ఇంటర్మీడియేట్ మార్క్స్ లిస్ట్ కాపీలు పొందుపరచాల్సి ఉంటుంది.
✓నమోదు చేసుకున్న అభ్యర్ధులకు, ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది.ఎంపిక ప్రక్రియలో కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CAT (Career Aptitude Test) పరీక్ష అనగా అభ్యర్థులకు క్వాంటిటేటివ్-10 మార్కులు, లాజికల్ రీజనింగ్ -10 మార్కులు & వెర్బల్ -10 మార్కులు పై ఆన్లైన్ లో 30నిముషాల వ్యవధి లో ఆబ్జెక్టివ్ పరీక్ష రాయవలేను. ఈ పరీక్షలో ప్రతీ సెక్షన్ లో 4 మార్కులు ఖచ్చితంగా వచ్చిన యెడల అభ్యర్ధి తదుపరి రౌండ్ కి ఎంపిక అవుతాడు. CAT పూర్తి అయిన తరువాత అభ్యర్ధికి ఇచ్చిన అంశంపై వ్యాస రచన రాయవలెను. 25 నిముషాల వ్యవధి లో 150+ పదాలతో వ్యాసాన్ని పూర్తి చేయవలెను. ఇందులో ఎంపిక అయిన అభ్యర్ధులకు HR ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడ ఎంపిక అయిన అభ్యర్ధులు HCL నుండి TechBee ప్రోగ్రాంలో చేరుటకు ఆఫర్ లెటర్ ని పొందుతారు.
✓ఈ TechBee ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క కాలపరిమితి ఒక సంవత్సరం వుంటుంది. మొదటి 6నెలలు తరగతి గదిలో టీచింగ్ (ప్రస్తుతం ఇంటి వద్దనే) వుంటుంది. అభ్యర్ధులకు అవసరమైన లాప్టాప్ (Laptop) మరియు ఇంటర్నెట్ కొరకు నెలకు రూ.650/- HCL వాళ్ళు అందిస్తారు. చివరి 6 నెలకు అభ్యర్థి ఇంటర్న్షిప్ కొరకు నిర్దేశించిన HCL క్యాంపస్ కి వెళ్ళవలసి వుంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో అభ్యర్థికి నెలకు రూ.10,000/- చెప్పున అందించబడుతుంది.
✓HCL TechBee ట్రైనింగ్ ప్రోగ్రాం కొరకు అభ్యర్దులు రూ.1,18,000/- (అనగా 1,00,000 + 18,000 GST) రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్థికంగా వెనుకబడిన వారు మొత్తం చెల్లించలేని పరిస్థితిలో రూ.30,000/- చెల్లించి మిగిలిన రూ.88,000/- కొరకు Axis Bank వారు అందించే ఎడ్యుకేషన్ లోన్ పొందవచ్చు. ఈ లోన్ కొరకు అభ్యర్ధి ఎటువంటి అదనపు హామీ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు కేవలం HCL వారు అందించే ఆఫర్ లెటర్ సమర్పిస్తే సరిపోతుంది. ఈ లోన్ డబ్బులు, అభ్యర్థి HCL లో ఉద్యోగిగా చేరిన అనంతరం తన నెలవారి జీతంలో EMI రూపంలో తీర్చవచ్చు.
✓ట్రైనింగ్ ని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్ధికి ఉద్యోగిగా మారిన అనంతరం సంవత్సరంకు రూ.1.72 నుండి 2.2 లక్షల జీతాన్ని పొందవచ్చు.
✓అభ్యర్థులు ఇంటర్మీడయట్ అర్హతతో మిగిలిపోకుండా, HCL వారు అభ్యర్థుల ఉన్నత విద్యలో సహకారం అందిస్తారు. HCL , 3 విశ్వవిద్యాలయాలైన బిట్స్ పిలాని , శస్త్ర మరియు అమిటీ (AMITY) తో అనుబంధం కలిగివుంది. ఈ విశ్వవిద్యాలయాల ద్వారా అభ్యర్థులు ఉన్నత విద్యను పొందవచ్చు. వీటి కొరకు ఆర్థికంగా కూడా హెచ్ సి ఎల్ సహకారాన్ని అందిస్తుంది.
✓బిట్స్ పీలాని వారు 2 కోర్సులు అందుబాటులో ఉంచారు. ఒకటి BSc( డిజైనింగ్ & కంప్యూటింగ్ ) మరియు BSc (ఇంజినీరింగ్ & సైన్స్). ఈ కోర్సుల కాలపరిమతి 4 సంవత్సరాలు అనగా 8 సెమిస్టర్లు. ఇందులో చేరుటకు ఇంటర్మీడియేట్ నందు మాథ్స్ & ఫిజిక్స్ లో 60% కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. 4 సంవత్సరాల కోర్సు కొరకు బిట్స్ పిలానీ వారికి రూ. 2,42,000/- రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్ధి ప్రతీ సెమిస్టర్ లో రుసుము చెల్లించిన రసీదును HCL వారికి పొందుపరిచిన యెడల 50% రుసుము తిరిగి పొందవచ్చు. ఈ కోర్సు చేసిన అభ్యర్థులు ఎం. టెక్ చదవుటకు అర్హులు.
✓ SASTRA విశ్వవిద్యాలయం వారు అందించే BCA (Bachelor Of Computer Application- రుసుము రూ.1,20,000/-) లేదా AMITY విశ్వవిద్యాలయం వారు BCA (Bachelor Of Computer Application- రుసుము రూ.1,80,000/-), BBA (Bachelor Of Business Application- రుసుము రూ.2,00,000/-) లేదా B.Com (Bachelor Of Commerce- రుసుము రూ 1,20,000/-) పొందవచ్చు.
SASTRA లో విద్యను అభ్యసించిన అభ్యర్ధి ప్రతీ సెమిస్టర్ లో రుసుము చెల్లించిన రసీదును HCL వారికి పొందుపరిచిన యెడల 75% రుసుము తిరిగి పొందవచ్చు. అలాగే AMITY లో ఏ కోర్సులో విద్యను అభ్యసించిన అభ్యర్దులు HCL వారు అందించే రూ.90,000/- రుసుము తిరిగి పొందవచ్చు.
✓HCL లో పని చేస్తూ ఉన్నత విద్యను పూర్తి చేసే అభ్యర్థులు మరో 2 సంవత్సరాలు HCL తోనే సేవా ఒప్పందం అమలును స్వీకరించాల్సి వుంటుంది.
తిరుపతి, ఎస్ డి హెచ్ ఆర్ కాలేజీలో 6-5-23 తేదీన ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది.
అభ్యర్థులు http://bit.ly/techbee22 లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
మరిన్ని వివరాలకు 9032697478, 7675827308, 8074919939, 9963859160 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు అని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.