-వేగవంతంగా విమానాశ్రయాల విస్తరణ
-వెయ్యేళ్ళ చరిత్ర గల రాజమండ్రి దేశానికే తలమానికం:
-కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య
కోరుకొండ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి విమానశ్రయాన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రూ.347 కోట్లతో విస్తరణ పనులను చేపట్టడం జరుగుతోందని కేంద్ర పౌర విమానాయ మరియు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా పేర్కొన్నారు .
ఆదివారం రూ.347 కోట్ల నిధు లతో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి భూమి పూజ, శంఖుస్థాపన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపి మార్గని భరత్ రామ్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, గోపాలపురం ఎమ్మెల్లే తలారి వెంకట్రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షరాలు దగ్గుపాటి పురాందేశ్వరి, ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ సంజయ్ కుమార్, మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు,
విమానయాన అధికారులు తదితరులు పాల్గొన్నారు…
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతి రాదిత్య సింధియా మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోదీ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదిన్నరేళ్లలో దేశంలో విమానయాన అభివృద్ధి రెట్టింపు అయిందన్నారు. భారత్ ని విశ్వగురువుగా నిలపడానికి చేస్తున్న ప్రయత్నంలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి, అందులో భాగంగా విమానయాన రంగాన్ని అభివృద్ధి వేగవంతంగా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2014 నాటికి దేశంలో 74 ఎయిర్ పోర్టులు ఉండగా, ఈ తొమ్మిదిన్నరేళ్లలో కొత్త మరో 75 ఎయిర్ పోర్టులు వచ్చాయన్నారు. దీంతో దేశంలో ఎయిర్ పోర్టులు 149 కి చేరాయన్నారు. రానున్న కాలంలో వీటి సంఖ్య 220 కి పెంచనున్నట్లు తెలిపారు. నగరానికి నగరానికి, రాష్ట్రానికి రాష్ట్రానికి వేగంగా ప్రయాణం చేయడానికి అనువుగా విమానయాన సంస్థ ప్రణాళికలు వేసి అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ పాయింట్ 21 వేల 94 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుందని, రద్దీవేళల్లో 2,100 మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం తో పాటు భవిష్యత్ లో ప్రతి ఏటా 30 లక్షల మంది ప్రయాణికులతో వార్షిక సామర్ధ్యం ఉంటుందని ఆయన తెలిపారు. 28 చెక్ ఇన్ కౌంటర్లు, నాలుగు అరైవల్ కక్లోజర్స్ , 600 కార్లకు సరిపడా కార్ పార్కింగ్, 5 స్టార్ రేటింగ్ తో ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దు కుంటుందని కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా వివరించారు.
ఆంధ్రప్రదేశ్ కి సాంస్కృతిక రాజధాని గా ఖ్యాతిగాంచిన రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి ఒడ్డున ఉందని, వెయ్యేళ్ళ ఉత్సవాలు చేసుకుంటున్న ఈ నగర సాంస్కృతిక వారసత్వం దేశానికే తలమానికమని కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా అన్నారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో టెర్మినల్ భవనాన్ని విస్తరించనున్న దృష్ట్యా ప్రస్తుతం 18 సర్వీసులు నడుపుతున్నట్లు, రానున్న రోజుల్లో 25 వరకు విమానయాన సర్వీసులను పెంచనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం 250 మంది ప్రయాణికులకు ఇక్కడ నుంచి ప్రతి నిత్యం ప్రయాణాలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో 1400 మందికి పైగా రోజు ప్రయణాలు సాగించేందుకు వీలుగా ఎయిర్ పోర్ట్ ను విస్తరించనున్నట్లు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో మౌలిక రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆ మేరకు దేశ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి విమానాశ్రయం కూడా అభివృద్ధి చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.
విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పెద్ద విమాన సర్వీసులకు అనుకూలంగా అత్యాధునిక సాంకేతికత, ఫర్నీచర్ అందుబాటులోకి రానుందని ఆమేరకు కీలక పనులకు ఈరోజు అంకురార్పణ చేశామన్నారు. విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి లను అంతర్జాతీయ విమానయాన సర్వీసులను ఇప్పటికి ప్రారంభించుకున్నా మన్నారు. భోగాపురం, ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లను గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లుగా ప్రారంభించు కోనున్నామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, తిరుపతి ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేశామన్నారు.
తొలుత తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ… అందరికీ నమస్కారం.. ఈ భూమిపైన నిలబడి మీతో ఈ మధురమైన క్షణాలను పెంచుకోవడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నా అంటూ కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజమహేంద్రవరం నగరం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, భారత దేశానికే సాంస్కృతిక, సంప్రదాయ , చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజధాని నగరం అని పేర్కొన్నారు. ప్రముఖ చారిత్రక నగరంగా వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఇటీవలే ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగిందన్నారు. ఎందరో చరిత్రకారులు, సంఘ సంస్కర్తలు పుట్టిన పుణ్య భూమి ఈ రాజమండ్రి అని పేర్కొన్నారు. ఆదికవి నన్నయ్య, న్యాయ పతి సుబ్బారావు, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడి వారే అన్నారు.
రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం మౌలిక సదుపాయాలు ఐటీ శాఖ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ దేశంలో అనేక ప్రాంతాలతో సంబంధాలు ఉన్న ప్రాంతం రాజమహేంద్రం అన్నారు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు,ప్రజలు ఆకాంక్ష మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విమానయాన, ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానయాన సర్వీసులు మరింత విస్తరింప చేయడం జరుగుతుందన్నారు. మధురపూడి విమానాశ్రయ సేవలు మరింత విస్తరించి దిశగా ప్రస్తుతం 4 వేలచద రపుమీటర్లు ఉన్న టెర్మినల్ 16000 చేయడంతో 20వేల చదరపు మీటర్లు విస్తరణం తో నాలుగు రెట్లు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఎయిర్పోర్ట్లు పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలకు సేవలందిస్తుందన్నారు. ఇటీవల భోగాపురంలో 2200 ఎకరాల్లో 4 వేల కోట్లు వ్యయంతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఎయిర్పోర్టు మరో 24 మాసాల్లో పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ… రు.347.15 కోట్ల రూపాయలతో నిర్మించే నూతనంగా నిర్మించే ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి వస్తుందన్నారు. రాజమహేంద్రవరం ఎంతో చారిత్రాత్మకమైన నగరమని,అటు వ్యాపార మరియు వాణిజ్య రంగాలకు ఈ ఎయిర్పోర్ట్ విస్తరణ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం అభివృద్ధికి, ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి దృఢ సంకల్పంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ ద్వారా పలు పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ కు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయని, పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.
స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ 1224 ఎకరాలలో సుమారు 70 లక్షల జనాభాకు ఉపయోగపడే విధంగా ఎయిర్పోర్ట్ అభివృద్ధిలో భాగంగా టెర్మినల్ నూతన భవన నిర్మాణం చేస్తున్నందుకు కేంద్రమంత్రి సింధియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు నెరేవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా, భూసేకరణ కోసం ఆనాడు రైతులు తమ భూములను స్వచ్ఛందంగా అందించారన్నారు.
ఈ ప్రాంత ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఎయిర్పోర్టు సి.ఎస్.ఆర్ నిధులు కేటాయించాలని కోరారు. రాజమహేంద్రవరం చుట్టూ పక్కల ప్రాంతాలు పారిశ్రామి కంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, ఈ ప్రాంతంలో కార్గో సర్వీస్లు ప్రారంభించాలని కోరారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 350 కోట్లు వెచ్చించి కొత్త టెర్మినల్ నిర్మిస్తోందని ఇది రాజమండ్రి చరిత్రలో నూతన అధ్యాయమని పేర్కొన్నారు. భారతదేశాన్ని విశ్వగురు చూడాలనే మన ఆకాంక్షకు అనుగుణంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రపంచంలో 5వ స్థానం నుండి 3 వ ఆర్థిక శక్తిగా భారత్ నిలబడాలని చేస్తున్న ప్రయత్నానికి అనుగుణంగా మౌలిక వసతులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి సారించారని అన్నారు. మౌలిక సదుపాయాలు శరవేగంగా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విమానాశ్రయాలు అభివృద్ధి ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కి దోహద పడుతుందన్నారు. ఉడాన్ కార్యక్రమం ద్వారా చిన్న పట్టణాలలో కూడా విమానాశ్రయాలు అభివృద్ధి చేయడం వలన ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఆమె విశ్లేషిం చారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, విజయవాడ, తిరుపతి విమానా శ్రయాలు అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
రాజమండ్రి విమానాశ్రయం ను రూ.350 కోట్ల తో అభివృద్ధి చేయడం ద్వారా ఒక నూతన అధ్యాయానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతోందని ఎయిర్పోర్ట్ మెజార్టీ చైర్మన్ ఆఫ్ ఇండియా సంజయ్ కుమార్ అన్నారు. మొత్తం 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మధురపూడి విమానాశ్రయం అందుబాటులో ఉందన్నారు. సుమారు 2000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణించే విధంగా పనులు చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. 2019 లో 1200 మీటర్ల పొడవు గల రన్ వే మార్గాన్ని 3600 మీటర్ల మేరకు విస్తరించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఈ విమానాశ్రయాన్ని మరింతగా పెంచే విధంగా అడుగులు వేయడం జరుగుతున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన మొదటి స్థానంలో ఉన్న నగరాల్లో విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావడం జరిగిందన్నారు. ఆ దిశలో రెండోవ స్థాయిలో ఉండే ప్రధాన నగరాలలోని విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం లో భాగంగా రాజమండ్రి ఎయిర్ పోర్టు లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన పనులకి కేంద్రం మంత్రి చేతుల మీదుగా శంఖుస్థాపన చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్. కే దినేష్ కుమార్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ ఆఫ్ ఇండియా సంజీవ్ కుమార్, మధురపూడి విమానాశ్రయ అధికారి ఎస్ జ్ఞానేశ్వర రావు పలువురు విమానయాన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.