Breaking News

ఆంధ్రప్రదేశ్ (ఆర్. సి. పి. ఐ) రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ నియామకం 


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ నియామకం జరిగింది. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లోలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మయూర్ శర్మ ,తెలంగాణ పార్టీ కార్యవర్గ సభ్యులు అగ్నివేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మయూర్ శర్మ , మాట్లాడు తూ. , భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గ విముక్తి కోసం అణగారిన వర్గాల కోసం 1934 సంవత్సరంలో ఆగస్టు 1, తేదీన, ఏర్పడిందని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. .దోపిడి అసమానతలు లేని సమాజం కోసం కార్మిక వర్గ రాజ్య స్థాపన, కోసం, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు కృషి చేయాలని, పిలుపునిచ్చారు. అనంతరం ఆర్. సి. పి.ఐ ఆంధ్ర ప్రదేశ్ నూతన ఆర్గనైజింగ్ కమిటిని ఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా రంబాల సతీష్,ను ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నుకున్నదిదని, మరియు ఐదుగురు సభ్యులతో నూతన కార్యవర్గ కమిటీ ఏర్పడిందని ,ఆయన తెలియజేశారు .కార్యవర్గ సభ్యులుగా జె. .కుమార్ ,డి నారాయణమూర్తి, బి .ఏసు, ఎం .నాగమణి ,షేక్ మహమ్మద్, ఎన్నికయ్యారు . ఈ కార్యక్రమంలో ఆర్ సి.పి.ఐ. కార్యకర్తలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *