Breaking News

రబీ సీజన్లో రైతులు పండిరచిన శెనగలుకు మద్దతు ధర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ.పి. మార్క్‌ ఫెడ్‌, జాతీయ సంస్థ అయిన నాఫెడ్‌ తరుపున ఎన్‌.టి.ఆర్‌. జిల్లాలో 2023-24 సంవత్సరంలో రబీ సీజన్లో రైతులు పండిరచిన శెనగలుకు మద్దతు ధర క్వింటాకి రూ.5440/- చొప్పున రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయుటకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డా.పి. సంపత్‌ కుమార్‌ నిర్ణయించారు.
కావున ఈ`క్రాప్‌లో శెనగ పంటను ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రముల వద్ద అమ్మదలచిన యెడల తమ సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి తమ పేర్లను సియం యాప్‌ లో తేది 27-02-2024 నుండి నమోదు చేసుకోగలరని తెలియజేస్తున్నాము. ఇతర వివరముల కొరకు తమ సమీప రైతు భరోసా కేంద్రాల వద్ద సంప్రదించవలసినదిగా జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *