Breaking News

సంపూర్ణ స్వచ్చత సాధనలో ఆంధ్రప్రదేశ్ ముందంజ

-పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్
-ఓడిఎప్ ప్లస్ ఎస్ బిఎం సర్వే యాప్ ను ఆవిష్కరణ
-గ్రామ పంచాయితీ కార్యదర్శుల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ అధికారుల ఇంటింటి సర్వే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ ఆంధ్ర సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. పూర్తి స్ధాయి స్వచ్చత గ్రామాలుగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ రూపకల్పన చేసిన ఓడిఎప్ ప్లస్ ఎస్ బిఎం సర్వే యాప్ ను శశిభూషణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని స్పష్టం చేసారు. గ్రామ పంచాయితీల కార్యదర్శుల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ అధికారులు ప్రస్తుతం వినియోగంలో ఉన్న మరుగు దొడ్ల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని కూడా సర్వే ద్వారా సేకరించాలన్నారు. తడి, పొడి చెత్త సేకరణలో గృహాల వద్దే విభజన జరిగేలా చర్యలు తీసుకునేందుకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. గృహవసరాల కోసం వినియోగించిన నీరు మళ్ళింపు, మురుగు నీరు నిల్వ ఉండకుండా తీసుకుంటున్న చర్యలను కూడా సర్వే అధికారులు పరిశీలించాలని శశిభూషణ్ కుమార్ ఆదేశించారు. స్వచ్చ ఆంధ్ర సాధనే ధ్యేయంగా స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా శశిభూషణ్ కుమార్ ప్రశంసించారు.

స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్యదర్శుల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధులు స్పష్టమైన సర్వే సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇంటింటికి వెళ్ళి మరుగుదొడ్ల వినియోగిస్తున్న వారి వివరాలు, స్వచ్చ కార్యక్రమాల అమలు తీరు, తడి, పొడి చెత్త సేకరణకు సమకూర్చిన ట్రాక్టర్లు, ఆటోలు, ట్రైసైకిళ్ళ వినియోగం, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలు నమోదు చేయాలన్నారు. ఈ సర్వే పై జిల్లా, డివిజన్ స్ధాయి పంచాయితీ అధికారుల పర్యవేక్షణ తప్పని సరని గంధం చంద్రుడు వివరించారన్నారు. ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే లక్ష్యంతో సఫాయి మిత్ర యాప్ ను ఇటీవలే ప్రారంభించుకున్నామన్నారు. ప్రజల భాగస్వమ్యంతో మార్పును తీసుకువచ్చి, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేయకుండా చూడడమే లక్ష్యంగా స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ముందుకు సాగుతోందని వివరించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కన్నబాబు, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *