విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శివరాత్రి పర్వదినం సందర్బంగా శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలో పలు దేవాలయాలలో మరియు పలు ప్రాంతాలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి.ఈ పూజ కార్యక్రమాలకు మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని దేవాదిదేవుళ్ళకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక 43వ డివిజన్ ఊర్మిళ నగర్ సెంటర్ లో గల బ్రహ్మం గుడి వద్ద జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి,కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక 37వ డివిజన్ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్తానం పాత శివాలయం లో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News